Lifestyle

ఇవి తాగితే హ్యాంగోవర్ వెంటనే తగ్గిపోతుంది

Image credits: freepik

హ్యాంగోవర్ ను తగ్గించే చిట్కాలు

మందు తాగిన తర్వాత హ్యాంగోవర్ ఖచ్చితంగా వస్తుంది. మరి దీన్ని తగ్గించుకోవడానికి ఏం తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..

టమాటా జ్యూస్

అవును టమాటా జ్యూస్ హ్యాంగోవర్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర వాపును తగ్గిస్తాయి. అలాగే తలనొప్పి, కండరాల నొప్పులు తగ్గుతాయి.

దోసకాయ వాటర్

కీరదోసకాయ వాటర్ లో మెగ్నీషియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు మెండుగా ఉంటాయి. ఈ వాటర్ లో నిమ్మరసం కలుపుకుని తాగితే వికారం, హ్యాంగోవర్ తగ్గుతుంది. బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. 

కొబ్బరి నీళ్ళు

కొబ్బరి నీళ్లలో కూడా పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఈ కొకొనట్ వాటర్ ను తాగితే మీ శరీరం హైడ్రైట్ గా ఉంటుంది. హ్యాంగోవర్  తొందరగా తగ్గుతుంది. 

గ్రీన్ స్మూతీ

హ్యాంగోవర్‌ తొందరగా తగ్గాలంటే బచ్చలికూరతో తయారు చేసిన గ్రీన్ స్మూతీని తాగండి. ఇది మీ శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. అలాగే ఇది మిమ్మల్ని ఫ్రెష్ గా కూడా ఉంచుతుంది. 

అల్లం టీ

హ్యాంగోవర్ వల్ల వాంతులు, వికారంగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు అల్లం టీ తాగితే ఇవి తగ్గుతాయి. అలాగే శరీర వాపు కూడా తగ్గుతుంది. హ్యాంగోవర్ మటుమాయమవుతుంది.

పుదీనా టీ

పుదీనా టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ టీని తాగితే తలనొప్పి,హ్యాంగోవర్ వెంటనే తగ్గిపోతాయి. 

Find Next One