Lifestyle
కృత్రిమ మేధస్సు (AI) అంటే యంత్రాలు కూడా మానవుల మాదిరిగా పనిచేయడం. మనలాగే నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం, భాషను అర్థం చేసుకుని ప్రతిస్పందించడం వంటివి యంత్రాలే చేస్తాయి.
భవిష్యత్ లో ఈ ఏఐ అనేక రంగాల్లో పెను మార్పులు సృష్టిస్తుందని అర్థమవుతుంది. విద్యారంగంలోనూ సరికొత్త సంస్కరణలకు ఏఐ నాంది పలుకనుంది.
కేవలం విద్యే కాదు ఆటలు కూడా విద్యార్థులకు ఎంతో ముఖ్యం. అయితే చదువును ఆటలతో ముడిపెట్టి గేమ్స్ ఆధారిత అభ్యాసానికి ఏఐ నాంది పలకనుంది.
విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా రియల్-టైమ్ కార్యకలాపాలు, కంటెంట్‌ను అందించడానికి విద్యాసంస్థలు AIని ఉపయోగించుకోనున్నాయి. ఇది మెరుగైన బోదనా అనుభవాన్ని అందిస్తుంది.
ఉపాధ్యాయులకు ఏఐ ఎంతగానో సహాయపడనుంది. అలాగే విద్యార్థులు బోధనపై ఎక్కువ దృష్టి పెట్టడానికి ఈ ఏఐ వీలు కల్పిస్తుంది.
AI-ఆధారిత చాట్‌బాట్‌లు విద్యార్థులకు తక్షణ సహాయం, సమాచారాన్ని అందిస్తాయి. సిలబస్ గురించి వివరాలను అందించడంతో పాటు అవి ఇతర సేవలకు కూడా కనెక్ట్ అవుతాయి.
మ్యాథ్స్ తో పాటు ఇతర సబ్జెక్ట్స్ లో నిర్దిష్ట విషయాలలో బోధనను ఏఐ అందించగలవు, ప్రతి విద్యార్థి అవసరాలకు అనుగుణంగా ట్యూటరింగ్ అనుభవాన్ని అందిస్తాయి.