Lifestyle

ఇక్కడకు వెళ్తే మిడ్ నైట్ కూడా సూర్యుడిని చూడొచ్చు

Image credits: Pixabay

నార్వే (స్వాల్బార్డ్)

స్వాల్బార్డ్ ప్రాంతంలో ఏటా ఏప్రిల్ 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు సూర్యుడు అస్తమించడు. సూర్యుడు క్షితిజ సమాంతర రేఖ కిందకు దిగకపోవడంతో రాత్రి ఏర్పడదు. 

Image credits: freepik

ఐస్లాండ్

ఐస్లాండ్ లో జూన్ నుండి జూలై ప్రారంభం వరకు సన్ కనిపిస్తూనే ఉంటాడు. ఆ రోజుల్లో పర్యాటకులు ప్రకృతి అందాలు, జలపాతాలు, హిమానీ నదాలకు చూడటానికి విహారయాత్రలు చేస్తారు. 

 

Image credits: freepik

స్వీడన్ (కిరునా)

స్వీడన్‌లోని కిరునా, మే చివరి నుండి జూలై మధ్య వరకు నిరంతర పగలే ఉంటుంది. అర్ధరాత్రి వేళలోనూ హైకింగ్, బోటింగ్ చేస్తూ పర్యాటకులు ఆనందంగా గడుపుతారు. 

Image credits: freepik

ఫిన్లాండ్ (లాప్లాండ్)

లాప్లాండ్‌లో వేసవిలో దాదాపు 70 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. స్థానికులు, సందర్శకులు వేసవి ఉత్సవాలు, అర్ధరాత్రి గోల్ఫ్‌ను ఆస్వాదిస్తారు. 

Image credits: freepik

కెనడా (నునావుట్)

నునావుట్ ప్రాంతంలో మే చివరి నుండి జూలై చివరి వరకు మిడ్‌నైట్ లోనూ సూర్యుడు సందడి చేస్తాడు.  ఆర్కిటిక్ ద్వీపసమూహమైన ఈ ప్రాంతం వన్యప్రాణులను చూడటానికి అనువైనది.

Image credits: Freepik
Find Next One