Lifestyle
ఆహారం సహాయంతో క్యాన్సర్‌ను నివారించవచ్చు. కానీ ఎక్కువగా ఉడికించి లేదా వేయించి తింటే ప్రమాదకరంగా మారే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి.
మాంసాన్ని ఎక్కువ వేడి మీద వేయించడం వల్ల PAH, HCA వంటి క్యాన్సర్ కారకాలు ఏర్పడతాయి. ఇవి DNA దెబ్బతినే క్యాన్సర్‌కు కారణమవుతాయి. కాబట్టి మాంసాన్ని సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించాలి.
బంగాళాదుంపలను ఎక్కువ సేపు వేయించడం లేదా కాల్చడం వల్ల క్యాన్సర్ కారకమైన అక్రిలామైడ్ విడుదలవుతుంది. కాబట్టి మధ్యస్తంగా వేడి చేసి ఉడికించడం మంచిది. వేయించే బదులు ఉడకబెట్టడం మంచిది.
పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరలు పోషకమైనవి, కానీ వీటిని ఎక్కువగా ఉడికించడం వల్ల నైట్రేట్ సంబంధిత పదర్థాలు ఏర్పడి క్యాన్సర్‌కు కారణమవుతుంది.
బియ్యం, ఇతర ధాన్యాలను ఎక్కువగా వేయించడం వల్ల అక్రిలామైడ్ ఉత్పత్తి అవుతుంది, దీనికి క్యాన్సర్‌తో సంబంధం ఉంది. సరైన పరిమాణంలో నీటిలో ధాన్యాలను ఉడికించాలి.
తేనెను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వల్ల అది HMFగా మారుతుంది, ఇది క్యాన్సర్ కారకం. దీన్ని ఎల్లప్పుడూ తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉపయోగించండి. టీలో తేనె వేయడానికి ముందు వేడి చేయవద్దు.