చాలా మంది మగవారికి పొట్ట ఉంటుంది. కానీ పొట్ట ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
1. వ్యాయామం చేయండి
పొట్టను తగ్గించడానికి మీరు ముందుగా చేయాల్సిన పని ప్రతిరోజూ వ్యాయామం చేయడం. అవును వ్యాయామంతో మీ పొట్ట చాలా వరకు తగ్గుతుంది. ఇందుకోసం రోజూ 30 నిమిషాల వ్యాయామం చేసినా సరిపోతుంది.
2. ఆహారం మీద శ్రద్ధ
పొట్ట ఉన్నవారు తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొట్ట తగ్గాలంటే అవీ ఇవీ కాకుండా ప్రోటీన్లు, కూరగాయలు, పండ్లు, తక్కువ కొవ్వున్న పాల ఉత్పత్తులను తీసుకోవాలి.
3. నిమ్మరసం మంచిది
బరువు తగ్గడానికి నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో తక్కువగా ఉండే కేలరీలు మీరు బరువు తగ్గడానికి, పొట్టను కరిగించుకోవడానికి సహాయపడతాయి.
4. నడక మంచిది
పొట్ట, బరువు తగ్గాలంటే మీరు ప్రతిరోజూ ఖచ్చితంగా నడవాల్సిందే. ఎందుకంటే వాకింగ్ వల్ల ఫ్యాట్ కరుగుతుంది. దీంతో మీ బరువు బరువు తగ్గుతారు. మీ శరీరానికి మంచి ఆకారం వస్తుంది.
5. నిద్ర ముఖ్యం
నిద్రలేకపోతే కూడా బరువు పెరుగుతారని నిపుణులు చెప్తారు. నిద్రలేమి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజూ సరిపడా నిద్రపోవాలి.