Lifestyle

సాక్స్ ల నుంచి దుర్వాసన పోగొట్టెదెలా?

సాక్స్ ల నుంచి దుర్వాసన

సాక్స్ లను కాసేపు ధరించినా భరించలేని దుర్వాసన వస్తుంది. అయితే.. ప్రతిసారీ ఉతకడం అందరికీ సాధ్యంకాకపోవచ్చు. అలాంటి సమయంలో ఈ హ్యాక్స్ తో దుర్వాసన రాకుండా ఆపొచ్చు.

 

బేకింగ్ సోడా..

దుర్వాసనను తొలగించడంలో బేకింగ్ సోడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాత్రిపూట మీ సాక్స్‌లో కొద్దిగా బేకింగ్ సోడాను చల్లి, ఉదయం దులిపేయండి.

నిమ్మరసం

దుర్వాసన, బ్యాక్టీరియాను తొలగించడానికి నిమ్మరసం కూడా సరిపోతుంది. ఒక స్ప్రే బాటిల్‌లో నిమ్మరసం తీసుకుని సాక్స్‌పై స్ప్రే చేయండి. సాక్స్‌లను గాలిలో ఆరబెట్టండి. దుర్వాసన పోతుంది.

టీ ట్రీ ఆయిల్ స్ప్రే

టీ ట్రీ ఆయిల్‌లో బ్యాక్టీరియా , ఫంగస్‌ను చంపే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. నీటిలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి సాక్స్‌పై స్ప్రే చేయండి.

బేబీ పౌడర్‌ను ఉపయోగించండి

సాక్స్ ధరించే ముందు వాటిలో బేబీ పౌడర్ చల్లుకోండి. ఇది చెమటను పీల్చుకుంటుంది . దుర్వాసన రాకుండా చేస్తుంది.

వినెగర్, నీటి స్ప్రే

సాక్స్‌లను కొద్దిసేపు వెనిగర్ , నీటి ద్రావణంలో నానబెట్టండి. ఇది దుర్వాసనను తొలగిస్తుంది.బ్యాక్టీరియాను కూడా చంపుతుంది.

Find Next One