Lifestyle

ఆ రాజు వల్లే ఇండియాలో కరెన్సీ మొదలైంది: రూపాయిపై 10 ఆసక్తికర విషయాలు

షేర్ షా సూరి

ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు కరెన్సీ ద్వారానే పనిచేస్తాయి కదా. ఇండియాలో ఈ వ్యవస్థను 1540-1545 మధ్య షేర్ షా సూరి ప్రారంభించారు. వెండి నాణేన్ని జారీ చేసిన మొదటి వ్యక్తి ఆయనే.

బెంగాల్ నుండి కాగితం కరెన్సీ

18వ శతాబ్దంలో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, జనరల్ బ్యాంక్, బెంగాల్ బ్యాంకులు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో కాగితం కరెన్సీని ప్రారంభించాయి.

రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన మొదటి నోటు

1938లో జార్జ్ VI చిత్రంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి ఐదు రూపాయల నోటును విడుదల చేసింది. 

'అణా సిరీస్' ప్రారంభం

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15, 1950న అప్పటి ప్రభుత్వం 'అణా సిరీస్'ని ప్రారంభించింది. ఇది ఇండిపెండెంట్ ఇండియా రిలీజ్ చేసిన మొదటి అధికారిక కరెన్సీ.

'₹' చిహ్నానికి ఆమోదం

2010 తర్వాత రూపాయికి '₹' చిహ్నం ఆమోదం పొందింది. ఈ చిహ్నం దేవనాగరి హల్లు 'र' కు గుర్తు. ఆంగ్ల పెద్ద అక్షరం 'R' నుండి తీసుకున్నారు.

అసలు, నకిలీ నోట్లను గుర్తించే వాటర్‌మార్క్

జాతీయ చిహ్నం అశోక స్తంభంతో పాటు భారతీయ నోట్లలో మహాత్మా గాంధీ వాటర్‌మార్క్ ఉంది. ఇది భారతదేశం సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

కరెన్సీ ప్రవాహాన్ని RBI నిర్వహిస్తుంది

భారతదేశంలో కరెన్సీని జారీ చేయడం, మార్చడం, ఉపసంహరించుకునే హక్కు RBIకి ఉంది. దేశంలో కరెన్సీ ప్రవాహం, లభ్యత సామరస్యంగా ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తుంది.

రూ.1 నుండి రూ.500 వరకు వ్యాపారం

భారతదేశంలో ₹1, ₹2, ₹5, ₹10, ₹20, ₹50, ₹100, ₹200, ₹500 నోట్లు మరియు నాణేలు ఉన్నాయి.

ప్రతి నోటుకు ఒక ప్రత్యేక సంఖ్య

భారతీయ కరెన్సీలో ప్రత్యేక కాగితం, వాటర్‌మార్క్, ఇంటాగ్లియో ప్రింటింగ్, మైక్రోప్రింటింగ్, సెక్యూరిటీ థ్రెడ్ కలర్-షిఫ్టింగ్ ఇంక్ వంటి అనేక భద్రతా లక్షణాలు ఉన్నాయి.

భారతదేశ సాంస్కృతిక వారసత్వం

భారతీయ కరెన్సీలోని ప్రతి నోటులో సూర్య దేవాలయం (10 నోటు), ఎర్రకోట (500 నోటు) ఇతర చారిత్రక ప్రాముఖ్యత కలిగిన చిత్రాలు ఉన్నాయి.

క్యాన్సర్ ముప్పు పెంచే ఆహారాలు ఇవి

భారత్ లో కరెన్సీ ఎప్పుడు ప్రారంభమైంది? టాప్-10 ఫ్యాక్ట్స్

హెల్మెట్ పెట్టుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ముఖానికి కరివేపాకును ఇలా పెడితే పండగ వేళ అందంగా కనిపిస్తారు