ఇవాళ (బుధవారం) కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. 181 రోజుల తర్వాత బాబా భక్తులకు దర్శనమిస్తున్నారు. మరి తక్కువ బడ్జెట్‌లో ఈ యాత్రను ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం.
హైదరాబాద్ నుండి ఢిల్లీకి… అక్కడినుండి కేదార్‌నాథ్ వెళ్లడం చాలా సులభం. ఇక్కడి నుంచి కారు, బస్సు, రైలు లేదా విమానంలో తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో చేరుకోవచ్చు.
రైలు ప్రయాణం ఉత్తమమైనదిగా చాలామంది భావిస్తారు. అందుకే మీరు ఢిల్లీ నుంచి కేదార్‌నాథ్ వెళ్లడానికి రైలు మార్గాన్ని ఎంచుకోండి. డిల్లీ నుంచి చాలా రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
మీరు చౌకగా కేదార్‌నాథ్ యాత్ర చేయాలనుకుంటే ముందుగా ఢిల్లీ నుంచి హరిద్వార్ లేదా రిషికేశ్ చేరుకోండి. ఇక్కడికి స్లీపర్ క్లాస్ రైలు టికెట్ ధర రూ.200 నుంచి రూ.250 మాత్రమే ఉంటుంది.
హరిద్వార్ నుంచి ప్రభుత్వ బస్సులో సోన్‌ప్రయాగ్ వరకు వెళ్లండి. దీనికి రూ.500-600 ఖర్చవుతుంది. సోన్‌ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వెళ్లడానికి షేరింగ్ జీపులు ఉంటాయి. ఛార్జీ రూ.50 ఉంటుంది.
గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ ధామ్ వరకు నడవాల్సి ఉంటుంది. గౌరీకుండ్ లేదా కేదార్‌నాథ్‌లో రాత్రి బసకు టెంట్లు లేదా ధర్మశాలలు అందుబాటులో ఉంటాయి. వీటికి రూ.600 వరకు ఖర్చవుతుంది.
గౌరీకుండ్ లేదా కేదార్‌నాథ్ ధామ్‌లో మీరు భండారాలలో (అన్నదానం) ప్రసాదం స్వీకరించవచ్చు. లేదా ఇక్కడ చాలా ధాబాలు ఉన్నాయి. ఇవి రూ.50 నుంచి రూ.100కే కడుపు నిండా భోజనం పెడతాయి.