ఓదార్పు యాత్ర చేసిన జగనన్నకే శ్రీరెడ్డి ఓదార్పు
వైసీపీ ఓటమిపై శ్రీ రెడ్డి స్పందించారు. ‘‘బాధపడకు జగన్ అన్న... నిన్ను నమ్ముకున్న వాళ్ళ అందరి కోసం బలం తెచ్చుకో.. అంటూ ధైర్యం చెప్పారు. ఓదార్పు యాత్ర జగన్నే శ్రీ రెడ్డి ఓదార్చారు.
శ్రీ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ పరిచయం అక్కర్లేని వ్యక్తి. సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసి ఏదీ సెట్ అవక సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ ఉన్నారు. అనుకోని ఘటనలతో బాగా పాపులర్ అయిపోయారు. తరచూ ఓ వర్గం సినీ నటులు, నిర్మాతలు, దర్శకులపై హద్దుల్లేని హాట్, బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే, వైసీపీలో ఏం జరిగినా, జగన్ ను ఏవరేమన్నా వారికి కౌంటర్ ఇస్తుంటారు. సోషల్ మీడియా ద్వారా తన భావాలను వ్యక్తం చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు, ఆ తర్వాత వైసీపీ ఘోరంగా ఓడిపోయినా తీరు చూసి ఆమె ఇలా స్పందించారు..
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల ఫలితాలు రాక ముందు శ్రీరెడ్డి చేసిన పోస్ట్ ఇది..
‘‘YSRCPకి 126 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని నా అంచనా.. గాడ్ బ్లెస్ యూ జగన్ అన్న’’
వైసీపీ ఓడిపోతోందని తెలిశాక శ్రీరెడ్డి చేసిన పోస్టు ఇదీ... ‘‘ఏమైనా మనం జగన్నతోనే...’’
ఏపీలో జగన్ పార్టీ ఓటమి ఖరారయ్యాక ఇలా.... ‘‘గెలిచినా ఓడిన జగన్ అన్న ని తక్కువ అంచనా వేయకండి .. అరణ్యం పాలైన అర్జునుడు తిరిగి రాజ్యాన్ని చేపట్టినట్టు ,పట్టు వదలకుండా తన రాజకీయాన్ని చాకచక్యం గా కొనసాగిస్తాడు..ఆయన సైన్యం గా మేమంతా జగన్ అన్నతో ఉంటాం’’
జగన్ పార్టీయే మళ్లీ ఏపీలో వస్తుందన్న ఆశలు నీరుగారాక శ్రీరెడ్డి చేసిన పోస్టు ఇదీ... ‘‘బాధపడద్దు.. 🤗ఎత్తoడి రా తల,😎ఎగురయిరా కాలర్ ..ధైర్యంగ నిలబడరా👍..ప్రజలకు ఏ ప్రభుత్వం ఇవ్వలేనన్ని స్కీమ్స్ ఇచ్చిన✊ జగన్ అన్న తాలూకా అని గర్వంగా చెప్పరా.. జై వైస్సార్సీపీ’’
చివరగా 11 స్థానాలతో వైసీపీ ఘోరంగా ఓడిపోయాక జగన్మోహన్ రెడ్డిని ఓదారుస్తూ శ్రీరెడ్డి చేసిన పోస్టు ఇది... ‘‘బాధపడకు జగన్ అన్న ..క్యాడర్ కి కొత్త ఊపిరి పొయ్యి .నిలబడు ,పోరాడు..నిన్ను నమ్ముకున్న వాళ్ళ అందరి కోసం బలం తెచ్చుకో ..ఇక రోజు ఒక పోరాటమే..విజయం వున్న వాళ్ళ వైపు జారబడే వాళ్ళు ఎక్కువ..వెక్కిరించే వెదవలు కోసం కాదు ,నీ సైన్యం కోసం పోరాడాలి’’
మొదటి నుంచి శ్రీరెడ్డి వైసీపీ సపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చేది. కొన్ని హద్దుమీరి మాట్లాడేది కూడా. ఇటీవల ఎన్నికల ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీతతో పాటు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను కూడా దారుణంగా దూషించారు. ఆ సమయంలో సునీత, షర్మిల ఎంతో వేదన చెందారు. స్వయానా చెల్లెళ్లనే జగన్ ఇలా తన పెయిడ్ బ్యాచ్ తిట్టిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు....