కింగ్ నాగార్జున బర్త్ డే..ఎప్పటికీ మరచిపోలేని కెరీర్ బెస్ట్ మూవీస్ ఇవే
Image credits: instagram
శివ (1989)
ఈ యాక్షన్ చిత్రం నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మలకు గొప్ప విజయాన్ని అందించింది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం నాగార్జున కెరీర్ ని మార్చేసింది.
Image credits: instagram
గీతాంజలి (1989)
ఈ ప్రేమకథా చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఉత్తమ వినోదాన్ని అందించిన చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.
Image credits: instagram
అన్నమయ్య (1997)
ఈ సినిమాలో నాగార్జున 15వ శతాబ్దపు రచయిత అన్నమాచార్య పాత్రను పోషించారు. ఇది గొప్ప విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి కూడా నేషనల్ అవార్డు దక్కింది.
Image credits: instagram
మనం (2014)
నాగార్జున నిర్మించి నటించిన ఈ చిత్రంలో ఆయన తండ్రి, కొడుకు నాగ చైతన్య కూడా నటించారు. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం క్లాసిక్ హిట్ గా నిలిచింది.
Image credits: instagram
ఊపిరి (2016)
ఈ మూవీలో నాగార్జున వీల్‌చైర్‌కే పరిమితమైన మిలియనీర్‌గా నటించారు. ఇది వాణిజ్యపరంగా హిట్ అయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.