Entertainment
ప్రతి స్త్రీ కూడా పనితో పాటు తన మీద కూడా దృష్టి పెట్టాలి. విశ్రాంతి, ఆనందం అందరికీ చాలా ముఖ్యం.
కరీనాకి నటన అంటే చాలా ఇష్టం, దాన్ని జీవితాంతం చేయాలనుకుంటుంది. ఎవరి కోసం ఇష్టాలు మార్చుకోకూడదు అంటుంది.
కరీనా తరచుగా షూటింగ్ కి తైమూర్, జెహ్‌ను తీసుకెళ్తుంది. పెళ్ళై పిల్లలు ఉన్న ప్రతి తల్లి ఇలా చేయవచ్చని చెబుతుంది.
స్త్రీలలో స్వార్థం కూడా ఉండాలి. తమ కోసం తాము ఆలోచించాలి. అభివృద్ధికి కృషి చేయాలి అంటుంది.
విజయం అంటే డబ్బు, పేరు కాదు. సంతోషం, తృప్తి. ఈ మాట మన నిజమైన విజయం ఏమిటో ఆలోచించేలా చేస్తుంది
ఒక స్త్రీ... నటి, తల్లి ఇలా చాలా రంగాల్లో ఒకేసారి రాణించవచ్చని కరీనా చూపించింది.
కరీనా తన కెరీర్‌లో చాలా మార్పులను స్వీకరించింది. ప్రతిసారీ కొత్తగా కనిపించింది. మార్పుకు భయపడకుండా దాన్ని స్వీకరించాలని చెబుతుంది.
జీవితం సుఖదుఃఖాలతో నిండి ఉంటుంది. అందుకే బలంగా ఉండటం ముఖ్యం. దానితో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా కాపాడుకోండి.
నేను విజయం, వైఫల్యాన్ని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోను. ముందుకు సాగడం మీదే దృష్టి పెడతానని కరీనా అంటుంది.