Asianet News TeluguAsianet News Telugu

bigg Boss 7 : పల్లవి ప్రశాంత్ కు అండగా నిలిచిన భోలే షావలి..

bigg Boss 7: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్ భోలే షావలి స్పందించారు. అభిమానుల అత్యుత్సహమే తప్పా.. పల్లవి ప్రశాంత్ కు ఎలాంటి దుర్దేశం లేదని అన్నారు.  తప్పించుకోవాలనే ఉద్దేశం పల్లవి ప్రశాంత్ కు లేదని, ఎలాంటి దిక్కుతొచ్చని పరిస్థితిలో ఫోన్ స్వీచ్ ఆప్ చేసి ఉండాలని అభిప్రాయ పడ్డారు భోలే షావలి. 

bigg Boss 7 contestant Bhole Shavali support to Pallavi Prashanth KRJ
Author
First Published Dec 21, 2023, 1:38 AM IST

bigg Boss 7: బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ విజేత పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  సిద్ధిపేట గజ్వేల్‌ మండలం కొల్లూరులోని అతని నివాసం నుంచి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్డూడియో దగ్గర గొడవ నేపథ్యంలో అతనిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. అయితే.. అతడ్ని ఏ పోలీస్ స్టేషన్ కు తరలించారనేది తెలియారావడం లేదు. పలు మీడియా కథనాల ప్రకారం.. పల్లవి ప్రశాంత్‌పై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

అతనితో పాటు ప్రశాంత్ సోదరుడు రవిరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిగ్‌బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం జూబ్లీహిల్స్‌లో పల్లవి ప్రశాంత్ అభిమానులు బీభత్సం సృష్టించారు. ఆ సమయంలో జరిగిన గొడవలో పలు కార్లు సహా, ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. 

ఈ తరుణంలో పల్లవి ప్రశాంత్ కు  బిగ్ బాస్ కంటెస్టెంట్ భోలే షావలి అండగా నిలిచారు. ఆ నేపథ్యంలో భోలే షావలి  asianet news telugu ప్రతినిధితో మాట్లాడుతూ.. తాను పల్లవి ప్రశాంత్ కు అండగా నిలిచాననీ, తమకు తెలంగాణ హైకోర్టు న్యాయవాది డా. వినోద్ తమకు న్యాయ సలహాలు అందిస్తున్నారని తెలిపారు. తాము న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు. 
 
పల్లవి ప్రశాంత్ ఫోన్ స్వీచ్ ఆఫ్ చేయడంపై స్పందిస్తూ.. తప్పించుకోవాలనే ఉద్దేశం పల్లవి ప్రశాంత్ కు లేదని, ఎలాంటి దిక్కుతొచ్చని పరిస్థితిలో ఫోన్ స్వీచ్ ఆప్ చేసి ఉండాలని అభిప్రాయ పడ్డారు భోలే షావలి. 

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న యూనిటి బయట లేదనీ, ఈ విషయంలో తన తోటి కంటెస్టెంట్లు (యవర్, రతిక, శివాజీ) ఎవరూ స్పందించలేదని, తాను ఒక్కడినే పోలీస్ స్టేషన్ లో పడిగాపులు కాస్తున్ననని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రశాంత్ విన్నర్ అయిన తరువాత రైతుల్ని ఆదుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారనీ,   మల్లన్న సాగర్ ముంపు ప్రాంతమైన 14 గ్రామాల రైతులను ఆదుకుంటారని ఓ రిపోర్టర్ ప్రశ్నకు ‘నాకు ఏమైనా సీఎం పదవి ఇచ్చారా? నేను రైతు బిడ్డని అంతే. మాట్లాడితే కాస్త అర్ధం ఉండాలి. నన్ను సీఎం చేస్తానంటే చెప్పండి.. ఆ రైతుల్ని ఆదుకుంటా.. నేనేమైనా పదవిలో ఉన్నానా? ఆ 14 ఊర్లను ఆదుకుంటా.. లేదంటే నాకు ఏదైనా మంచి పదవి ఇవ్వండి.. ఆ రైతుల్ని ఆదుకుంటా’ అని ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. బిస్ బాస్ హౌస్ లో హీరో శివాజీ .. ప్రశాంత్ కు ఎంతగానో గైడ్ చేశారనీ, నిజానికి పల్లవి ప్రశాంత్ కు లాండ్ ఆర్డర్ పై సరైన అవగాహన లేదనీ, అందుకే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అన్నారు. పల్లవి ప్రశాంత్ కు తాను బిగ్ బాస్ హౌస్ లో సపోర్టుగా ఉన్నాననీ, ఇప్పుడు ఆపదలో ఉన్నా ప్రశాంత్ కు అండగా ఉంటానని అన్నారు. 

పల్లవి ప్రశాంత్ పై ఏ ఏ సెక్షన్లపై కేసు నమోదు చేశారనేదనీ పూర్తిగా తెలియజేయాలని అన్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లను అదే రోజు పంపించకుండా .. మరుసటి రోజు పంపించి ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదనీ, ఇలాంటి పరిణామాలు జరిగి ఉండేవి కావని భోలే అభిప్రాయపడ్డారు. గతంలో సింగర్, రచయిత కందికొండ విషయంలో కూడా బోలే షావలి అండగా నిలిచారు. ఆయన మరణ అనంతరం కూడా వారి కుటుంబానికి సహయం చేసిన విషయం తెలిసిందే.  
 

Follow Us:
Download App:
  • android
  • ios