ప్రపంచంలోనే ఎత్తైన వివేకానంద విగ్రహం ఎక్కడ నిర్మిస్తున్నారు?
Telugu
ఇండోర్లో ఎత్తైన వివేకానంద విగ్రహం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వివేకానందుడి విగ్రహం ఇండోర్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాన్ని ఎవరు నిర్మించారు? ప్రత్యేకత గురించి తెలుసుకుందాం రండి.
Telugu
ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఇదే
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్వామి వివేకానంద విగ్రహం సిర్పూర్ లేక్ గార్డెన్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహం ఎత్తు 52 అడుగులు, బరువు 14 టన్నులు.
Telugu
విగ్రహం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు?
ఇండోర్ నగరపాలక సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఇది భక్తి కేంద్రంగానే కాకుండా, యువతకు జీవిత విలువలను అర్థం చేసుకొనే స్ఫూర్తినిస్తుందని అధికారులు తెలిపారు.
Telugu
విగ్రహాన్ని ఎవరు తయారు చేస్తున్నారు?
ప్రముఖ శిల్పి నరేష్ కుమావత్ ఈ గొప్ప విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. భారతదేశం అంతటా అనేక చారిత్రాత్మక విగ్రహాలను ఆయనే నిర్మించారు.
Telugu
ఉడుపి, కన్యాకుమారిని మించి..
ఇప్పటివరకు కన్యాకుమారి, ఉడుపి భారీ స్వామి వివేకానంద విగ్రహాలున్నాయి. ఇండోర్లో విగ్రహం వాటిని మించి పొడవు ఎక్కువ. ఈ విగ్రహం 39.6 అడుగుల ఎత్తు ఉంది.
Telugu
విగ్రహ నిర్మాణంలో ప్రత్యేక లోహాలు
ఈ విగ్రహాన్ని ప్రత్యేక లోహాలతో తయారు చేస్తున్నారు. అది వాతావరణ మార్పులను తట్టుకుని, సంవత్సరాల తరబడి నిలబడుతుందని, దీని కోసం ఆధునిక సాంకేతికతలను కూడా ఉపయోగిస్తున్నారట.
Telugu
డిజిటల్ గ్యాలరీ కూడా..
విగ్రహ స్థలంలో స్వామి వివేకానంద జీవితం, తత్వశాస్త్రం ఆధారంగా ఒక గ్యాలరీని కూడా నిర్మిస్తారు. దీనిలో చిత్రాలు, పత్రాలు, డిజిటల్ మీడియా ద్వారా అవసరమైన సమాచారం అందిస్తారు.
Telugu
CM భూమి పూజ
CM మోహన్ యాదవ్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ స్థలం సాంస్కృతిక, పర్యాటకంగానూ అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.