Astrology
సూర్యాస్తమయం తర్వాత పాలు దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. తెలుపు రంగు చంద్రుడికి సంబంధించినది కాబట్టి దానం చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని అంటారు.
సూర్యాస్తమయం తర్వాత పెరుగు దానం చేయకూడదని పండితులు సూచిస్తుంటారు. ఎందుకంటే పెరుగు శుక్ర గ్రహానికి సంబంధించింది కావడమే.
పసుపు ఐశ్వర్యానికి చిహ్నం కాబట్టి సూర్యాస్తమయం తర్వాత దానం చేయకండి. రాత్రుళ్లు పసుపు దానం చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంటున్నారు.
సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ డబ్బు దానంగా లేదా అప్పుగా ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. ఇది కూడా ఆర్థికంగా ఇబ్బందులకు దారి తీస్తుందని చెబుతున్నారు.
సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను ముట్టుకోకూడదు. అంతేకాదు సాయంత్రం తులసి మొక్కను ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేస్తేఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.
సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. ఇది కూడా ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తుందని అంటున్నారు.
సూర్యాస్తమయం తర్వాత జుట్టు, గోళ్లు కత్తిరించడం వంటివి అస్సలు చేయకూడదు. అలాగే ఇంటిని ఊడ్చకూడదు. ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు దారి తీస్తుందని పండితులు అంటున్నారు.