Andhra Pradesh
Andhra Pradesh Metro : ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మెట్రో రైలు కూత వినిపించనుంది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్ 46.23కిలోమీటర్ల మేర 3 కారిడార్ల నిర్మించాలని నిర్ణయించారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్లు. ఫస్ట్ ఫేజ్ లో ఇదే అత్యధిక దూరం, వ్యయంతో కూడుకున్నది.
విశాఖపట్నంలోని గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.08 కిలోమీటర్లు నిర్మించనున్నారు.
వైజాగ్ లోని తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్లు నిర్మించనున్నారు.
వైజాగ్ లోని కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు 30.67కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణం
ఇక విజయవాడలో కూడా రెండు దశల్లో ఈ మెట్రో ప్రాజెక్ట్ ను చేపట్టనున్నారు. ఏ ఫేజ్ లో ఏమార్గంలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారో వెల్లడించారు.
విజయవాడలోని గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు నిర్మించనున్నారు.
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు నిర్మించనున్నారు.
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు నిర్మించనున్నారు.
ఇలా వైజాగ్, విజయవాడ మెట్రోకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఈ రెండు నగరాల్లో మెట్రో నిర్మాణానికి ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.