వరంగల్: వరంగల్ మానవత్వానికే మచ్చ తెచ్చే సంఘటన చోటు చేసుకుంది. ఈ అత్యంత అమానవీయ ఘటనలో తండ్రి, మేనమామ కవల పిల్లల పట్ల అత్యంత నీచంగా ప్రవర్తించారు. కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించారు. 

ఇద్దరు కవల పిల్లలపై తండ్రి, మేనమామ అత్యాచారానికి పాల్పడ్డారు. అమ్మాయిలిద్దరు కూడా మైనర్లు. వరంగల్ లోని ఇంతేజార్ గంజ్ పోలీసు స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. షీ టీమ్స్ ఏసీపీ బాబూరావు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను శుక్రవారం రాత్రి వెల్లడించారు 

వరంగల్ లోని కాశిబుగ్గలో గల శ్రీనివాస నగర్ కాలనీకి చెందిన దంపతులకు 14 ఏల్ల కవలలు, ఓ కుమారుడు ఉన్నారు వారి తండ్రి, మేనమామ సెంట్రింగ్ పనులు చేస్తూ ఉంటారు. మూడేళ్ల నుంచి మేనమామ, ఏడాది కాలంగా తండ్రి బాలికలపై లైంగిక దాడికి పాల్పడుతూ వస్తున్నారు.

వేధింపులు ఎక్కువ కావడంతో ఇటీవల తాము చదువుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు బాలికలకు విషయాన్ని చెప్పారు. దాంతో ఉపాధ్యాయులు షీ టీమ్స్ కు సమాచారం ఇచ్చారు. నిందితులను అదుపులోకి తీసుకుని ఇంతేజార్ గండ్ పోలీసులకు షీ టీమ్స్ అధికారులు అప్పగించారు.