Asianet News TeluguAsianet News Telugu

పవన్ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దేరకం...: ఉత్తరాంధ్ర వైసిపి నాయకుడి ఘాటు వ్యాఖ్యలు

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడుపై ఉత్తరాంధ్ర వైసిపి పాయకులు కొయ్య ప్రసాదరావు ఘాటు వ్యాఖ్యలతో విమర్శలు గుప్పించారు.

YSRCP leader koyya prasad reddy fires on pawan kalyan, chandrababu
Author
Visakhapatnam, First Published Jan 21, 2020, 9:48 PM IST

విశాఖపట్నం:  సినిమా జీవితాన్ని ఇచ్చింది విశాఖ పట్నంపైనే జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ విషం చిమ్ముతున్నారని వైసిపి సీనియర్ నేత కొయ్య ప్రసాదరెడ్డి మండిపడ్డారు. అతడు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకమని... ఉత్తరాంధ్ర ప్రజల్లో అతడిపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు  బుద్దిచెప్పినా ఆయనలో మార్పు రాలేదని విమర్శించారు.  

ఉత్తరాంధ్ర నేత, స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు ఆత్మ క్షోభించేలా ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు, తమ్ముడు అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారని అన్నారు. వారందరిని ఉత్తరాంధ్ర ప్రజలు గమనిస్తున్నారని... సమయం వచ్చినప్పుడు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. 

read more  జగన్ పై మహిళా ఎమ్మెల్సీ సెటైర్లు... శాసనమండలిలో గందరగోళం

ప్రజాస్వామ్య బద్ధంగా ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ జరిగిందని... చట్టబద్ధంగా, తీర్మానాల ద్వారా పాలన వికేంద్రీకరణ జరిగిందన్నారు. చంద్రబాబు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నోసార్లు తెలుగుదేశానికి అఖండ విజయాలు అందించారని.. కానీ చంద్రబాబు ఉత్తరాంధ్రకు న్యాయం జరగకుండా ప్రయత్నిస్తున్నారని ప్రసాదరెడ్డి  అన్నారు. ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో చంద్రబాబు ఓసారి ఆలోచించాలన్నారు. 

సీఎం వైఎస్ జగన్ తాను ఇచ్చిన ప్రతి మాటా నిలుపుకుంటున్నారని... అందులో భాగంగానే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన దీక్షబూనారని అన్నారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగటానికి పాలన రాజధాని ఉపకరిస్తుందని పేర్కొన్నారు. అమరావతికి, అక్కడి రైతులకు, రైతు కూలీలకు జగన్ ఆర్ధిక సాయాన్ని పెంచడాన్ని ఉత్తరాంధ్ర వాసులు మనస్పూర్తిగా స్వాగతిస్తారని కొయ్య ప్రసాదరెడ్డి తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios