విశాఖపట్నం: ఓ మహిళపై ఏడుగురు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాల కారణంగా వారు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.  మహిళపై వారు మహిళను కొట్టుకుంటూ వీధుల్లో అర కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో శనివారం సాయంత్రం జరిగింది.

ఆమెపై వారు దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరు కూడా సాయానికి రాలేదు. విశాఖపట్నం నగరానికి చెందిన గుత్తి లక్ష్మి (35) తన భర్త నాగరాజు, కుమారుడితో కలిసి జీవీఎంసీ 66వ వార్డు ఎల్లపువానిపాలెం గ్రామంలో గత ఏడేళ్లుగా కిరాయి ఇంట్లో ఉంటోంది. 

భర్త ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా ఆమె ఇంటి వద్దనే ఉంటోంది. శనివారం సాయంత్రం భర్త నాగరాజు లేని సమయంలో నగరానికి చెందిన ఐదుగురు మహిళలు, మరో ఇద్దరు పురుషులు కలిసి కారులో వచ్చారు. గ్రామ శివారులో కారును ఆపి లక్ష్మి వద్దకు వచ్చారు. 

వస్తూనే ఆమెపై మూకుమ్మడిగా దాడి చేసి కొట్టుకుంటూ వీధుల వెంట తీసుకుని వెళ్లారు కాపాడాల్సిందిగా మహిళ పెట్టిన కేకలు అరణ్య రోదనే అయ్యాయి. కొట్టుకుంటూ వెళ్లి కారులో తమ వెంట తీసుకుని వెళ్లారు.