ఒట్టి చేతుల్తో రోడ్డును ఎత్తేశారు.. కాంట్రాక్టర్ కక్కుర్తి, నేల మీదినుంచి లేచొస్తున్న రహదారి.. వీడియో వైరల్...

మహారాష్ట్రలోని ఓ గ్రామస్థులు తమ ఊర్లో కొత్తగా వేసిన రోడ్డును ఖాళీ చేతుల్తో పట్టుకుని పైకి లేపారు. దీంతో రోడ్డు కాంట్రాక్టర్ కక్కుర్తి బయటపెట్టారు. నాసిరకం రోడ్డు వేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకున్న ఆ పని ఎలా ఉందంటే... 

Villagers Lifting Newly-Made Road With Bare Hands In Maharashtra, Video Viral - bsb

మహారాష్ట్ర : మహారాష్ట్ర లో ఓ రోడ్డుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ వీడియోలో గ్రామస్తులు తమ చేతులతో కొత్తగా వేసిన రోడ్డును 'లేపుతున్నట్లు' కనిపిస్తుంది. పలు ట్విటర్ హ్యాండిల్స్ పేర్కొన్నట్లుగానే ఈ వింత ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 38-సెకన్ల ఈ వీడియో క్లిప్‌లో నేరుగా రోడ్డుగా చెబుతున్న కాంట్రాక్ట్ మెటీరియల్ కింద ఉన్న కార్పెట్ లాంటి క్లాత్ కనిపిస్తుంది. ఈ రోడ్డును స్థానిక కాంట్రాక్టర్ వేశాడు.

రాణా ఠాకూర్‌గా ఈ క్లిప్‌లో పేర్కొన్న స్థానిక కాంట్రాక్టర్ చేసిన నాసిరకమైన పనిని గ్రామస్థులు నిందించారు. తారు క్రింద కార్పెట్‌ను పట్టుకుని.. ఇదంతా "బోగస్" పని అని వారు అంటున్నారు. ఫ్రీ ప్రెస్ జర్నల్ ప్రకారం, మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని అంబాద్ తాలూకాలోని కర్జాత్-హస్త్ పోఖారీలో ఈ సంఘటన జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎం రూరల్ రోడ్ స్కీమ్) కింద ఈ రహదారిని నిర్మించారు.

రోడ్డు నిర్మాణం కోసం జర్మన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు కాంట్రాక్టర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, వీడియోలో చూపించినట్లుగా, గ్రామస్తులు ఈ ఉత్తుత్తి రోడ్డు నాటకాన్ని బహిర్గతం చేయడంతో తమకు రాజకీయనాయకులు చేసిన వాగ్దానం బూటకమని తేలింది. స్థానికులు మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫ్రీ ప్రెస్ జర్నల్ ప్రకారం నాసిరకం పనిని ఆమోదించిన ఇంజనీర్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

మేక్ ఇన్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, దాదాపు 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. రోడ్డు నిర్మాణాన్ని అమలు చేయడానికి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వివిధ ఏజెన్సీలను కలిగి ఉంది : నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్స్, నేషనల్ హైవే అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్ లాంటివి. 

సాంప్రదాయిక రహదారి నిర్మాణంలో, మామూలుగా రోడ్డు నిర్మాణంలో కంకర, ఇసుక, మట్టి మిశ్రమాన్ని వాడతారు. ఇటీవలి సంవత్సరాలలో, ఇంజనీర్లు రహదారి మన్నికకు పెంచడానికి కాంక్రీటును ఉపయోగిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios