Asianet News TeluguAsianet News Telugu

కుక్క పిల్లల కోసం ప్రాణాలకు తెగించి.. పాముల బావిలోకి దిగి..

చీకటిగా ఉన్న పాడుబడిన బావిలోంచి వాటి అరుపులు వినిపిస్తున్నాయి. బావిలో ఉన్న వాటిని పైనుంచే తీసేందుకు ప్రయత్నించారు. అయితే, సాధ్యం కాలేదు. దీంతో ఓ పోలీసులు అధికారి స్వయంగా రంగంలోకి దిగారు. నేరుగా బావిలోకి దిగేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు.

Uttar Pradesh Cop Rescues 3 Puppies From Snake-Infested Well
Author
Hyderabad, First Published Jan 24, 2020, 9:15 AM IST

కుక్క పిల్లల కోసం ఓ పోలీస్ అధికారి తన ప్రాణాలకు తెగించాడు. పాములు ఉన్నాయని తెలిసినా బావిలోకి దిగి కుక్క పిల్లల ప్రాణాలు కాపాడాడు. ఈ సంఘన ఉత్తరప్రదేశ్ లో జరగగా.. ఆ పోలీస్ అధికారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read ఈతరం ఇల్లాలు... భర్తను మరో మహిళకు అమ్మేసి ఆ డబ్బుతో......

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆర్మోహాలో ప్రమాదవశాత్తు మూడు కుక్కపిల్లలు పాడుపడిన బావిలో పడిపోయాయి. దానిని చూసిన స్థానికులు వెంటనే 112 నెంబర్ కి ఫోన్ చేశారు. కుక్క పిల్లలు బావిలో పడిపోయినట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చీకటిగా ఉన్న పాడుబడిన బావిలోంచి వాటి అరుపులు వినిపిస్తున్నాయి. బావిలో ఉన్న వాటిని పైనుంచే తీసేందుకు ప్రయత్నించారు. అయితే, సాధ్యం కాలేదు. దీంతో ఓ పోలీసులు అధికారి స్వయంగా రంగంలోకి దిగారు. నేరుగా బావిలోకి దిగేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు.

అందులో పాములు ఉన్నాయని, దిగితే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. బావిలోకి దిగి మూడు పప్పీలను రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రాణాలకు తెగించి కుక్క పిల్లలను రక్షించిన పోలీసు అధికారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పప్పీలను రక్షిస్తున్న ఫొటోలను యూపీ  పోలీస్ విభాగం తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ‘బిగ్ సెల్యూట్ టు ఆఫీసర్’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios