బీచ్ లో బికినీ వేసుకున్నందుకు ఓ మహిళ పట్ల పోలీసులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. బికినీ వేసుకున్నందనే ఒకే ఒక కారణంతో ఆమెను లాక్కెళ్లి మరీ అరెస్టు చేశారు. ఈ సంఘటన మాల్దీవుల్లో చోటుచేసుకుంది. కాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. యూకేకి చెందిన ఓ మహిళా టూరిస్ట్... మాల్దీవులకు వచ్చింది. అక్కడ ఆమె బీచ్ లో బికినీ ధరించి.. వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది. సడెన్ గా అక్కడికి పోలీసులు వచ్చారు. ఆమె బికినీ వేసుకుందనే కారణంతో ఆమెను అరెస్టు చేశారు.

Also Read పీరియడ్స్ వస్తే.. మైనర్ అయినా పెళ్లి కి ఒకే .. కోర్టు షాకింగ్ తీర్పు...

ఆ సమయంలో ఆమె పోలీసులపై అరిచేసేసింది. ‘‘ మీరు నన్ను లైంగికంగా వేధిస్తున్నారు’ అంటూ ఆమె పేర్కొంది. ఆమెను అరెస్టు చేస్తున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు వీడియో తీయగా.. వీడియో కాస్త వైరల్ గా మారింది. ఆ వీడియోలో పోలీసులు తనను అరెస్ట్ చేయడాన్ని ఆమె ఖండిస్తోంది. ఓ పోలీసు ఆమె చేతికి సంకెళ్లువేస్తూ... ఆమె ఒంటిని టవల్ తో కప్పేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆమెను అక్కడి నుంచి పోలీసులు తీసుకొని వెళ్లిపోయారు.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లంతా సదరు పోలీసులపై మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆ మహిళను అరెస్టు చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. అధికారులు ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. దీంతో.. పోలీసులు కూడా దిగి రావాల్సి వచ్చింది. సదరు మహిళా టూరిస్ట్ కి క్షమాపణలు తెలియజేశారు