Asianet News TeluguAsianet News Telugu

గుండెపోటుతో హాస్పిటల్‌కి: ఫ్రీవైఫై వుందని.. 80 వేల పోర్న్ వీడియోలు డౌన్‌లోడ్

 ఓ ట్రాన్స్‌జెండర్ మాత్రం ఆసుపత్రిలోని ఫ్రీ వైఫై ఉపయోగించుకుని ఏకంగా 80 వేల పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేసింది. 

transgender downloaded 80000 porn images using free wifi in uk
Author
New Delhi, First Published Jul 16, 2020, 10:03 PM IST

ఎవరైనా గుండెపోటుతో ఆసుపత్రిలో చేరితే వారి పరిస్ధితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పుడు నయమైతే అప్పుడు ఇంటికి వెళ్లాలని చూస్తారు. కానీ ఓ ట్రాన్స్‌జెండర్ మాత్రం ఆసుపత్రిలోని ఫ్రీ వైఫై ఉపయోగించుకుని ఏకంగా 80 వేల పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేసింది.

వివరాల్లోకి వెళితే.. యూకేకు చెందిన 54 ఏళ్ల మార్షల్ అనే ట్రాన్స్‌జెండర్ 2017 ఆగస్టులో గుండెపోటుతో ఆసుపత్రిలో చేరింది. బెడ్డుపై చికిత్స తీసుకుంటూనే హాస్పిటల్‌లో ఉన్న ఫ్రీ వైఫైను తన ఫోన్‌కు, ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకుంది.

అనంతరం 80 వేల వరకు పోర్న్ ఫోటోలు, వీడియోలను ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసింది. ఇవన్నీ కూడా పిల్లల పోర్న్ ఫోటోలే కావడం గమనార్హం. అయితే పెద్ద మొత్తంలో ఉండే ఇంటర్నెట్ ప్యాక్ ఎంతో తొందరగా అయిపోవడంతో ఆసుపత్రి వర్గాలు అసలేం జరుగుతుంతో తెలియక తలలు పట్టుకున్నారు.

అసలు మేటర్ తెలియడంతో అవాక్కయ్యారు. ఉన్న నెట్‌ బ్యాలెన్స్‌ను అసభ్య ఫోటోలు, వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆమె వుపయోగించినట్లు తేలింది. దీంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు... జూలీ మార్షల్ వద్ద నుంచి ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ఆమెపై అనుమానంతో ఇంట్లో సోదాలు జరిపేందుకు వెళ్లారు. తలుపులు తీసి చూసిన పోలీసులకు కళ్లు బైర్లుకమ్మాయి.

దీనిపై సుధీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం జూలీకి తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఇప్పుడు పోలీసులకు అసలైన చిక్కొచ్చిపడింది. ట్రాన్స్‌జెండర్‌ను మహిళల జైళ్లో ఉంచాలా.. లేదా మగవాళ్ల జైల్లో ఉంచాలా..? అనేది అర్థమవక తలలు పట్టుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios