కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది.లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. వైరస్ ప్రభావం ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా రోజూ కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఇక అమెరికా పరిస్థితి అయితే... అత్యంత దారుణంగా ఉంది. ఈ వైరస్ చైనాలో పుట్టింది అన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వైరస్ ని పుట్టించిన చైనాపై నెట్టింట సెటైర్లు మొదలయ్యాయి.

ఏ దేశానికైనా చైనా వస్తువులు దిగుమతి అవుతూ ఉంటాయి. మనం వాడే చిన్న చిన్న వస్తువులపై కూడా మేడ్ ఇన్ చైనా అని రాసి ఉంటుంది.అయితే.. చైనా వస్తువులకు గ్యారెంటీ ఎక్కువగా ఉండదు అనే నమ్మకం కూడా అందరికీ ఉంది.

Also Read అతి దారుణంగా అమెరికా పరిస్థితి... ఒక్కరోజే 884 మరణాలు...

ఈ నేపథ్యంలో అన్నీ డూప్లికేట్ వస్తువులు పంపే చైనా.. కరోనా వైరస్ మాత్రం ఒరిజినల్ పంపించారంటూ ప్రజలు నెట్టింట సెటైర్లు వేస్తున్నారు. చైనా ఉత్పత్తులను వాడొద్దు.. వాటిని బహిష్కరించండి అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.  ఈ క్రమంలో చైనాపై తీవ్రస్థాయిలో జనాలు దుమ్మెత్తి పోస్తుండగా.. మరికొందరు మాత్రం చైనాపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. 

చైనా ఎలాంటి వస్తువునైనా తయారుచేసే దేశమనే పేరుంది. అంతేకాదు.. ఏ వస్తువునైనా సరే డూప్లికేట్ కూడా చేసేస్తుందనే పేరు కూడా ఉంది. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనాలు నవ్వుకుంటున్నారు.

‘చైనా ప్రతి విషయంలో డూప్లికేట్ అని నిరూపించుకుంటుంది.. పెద్దఎత్తున వస్తువులను డూప్లికేట్ తయారు చేసి ఇతర దేశాలకు పంపే చైనా కరోనాను మాత్రం ఎందుకు ఒరిజనల్ చేసింది.. ఇది కూడా డూప్లికేటే చెయొచ్చుగా..’ అని ఆ వీడియోలో ఉంది. టిక్‌టాక్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది.. దీన్ని చూసిన జనాలు నవ్వుకుంటూ కామెంట్లు, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.