Asianet News TeluguAsianet News Telugu

బెజవాడ భవానీ కథ సుఖాంతం: కూతురిని కన్నవారి చెంతకు చేర్చిన ఫేస్‌బుక్

విజయవాడ యువతి భవానీ కథ సుఖాంతమైంది. ఆమెను కన్న తల్లిదండ్రులకు అప్పగించేందుకు పెంచిన తల్లిదండ్రులు అంగీకరించారు

vijayawada girl Bhavani reunites with parents through Facebook after 14 Years
Author
Vijayawada, First Published Dec 8, 2019, 3:36 PM IST

విజయవాడ యువతి భవానీ కథ సుఖాంతమైంది. ఆమెను కన్న తల్లిదండ్రులకు అప్పగించేందుకు పెంచిన తల్లిదండ్రులు అంగీకరించారు. తాను కన్న తల్లిదండ్రుల వద్దే ఉంటానని భవానీ తేల్చి చెప్పడంతో ఆమె నిర్ణయం మేరకు పోలీసుల సమక్షంలో కన్న తల్లిదండ్రులకు భవానీని అప్పగించారు. దీంతో 14 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు చేరింది భవానీ.

తాను పదిరోజులు పెంచినవారి వద్ద.. పది రోజులు కన్నవారి వద్ద ఉంటానని భవానీ మీడియాకు తెలిపింది. తనకు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశ్యం లేదని ఇద్దరూ తనకు తల్లిదండ్రులేనని చెప్పింది. పోలీసులు సైతం డీఎన్ఏ టెస్ట్ ఏం అవసరం లేదని పోలికలు కనిపిస్తున్నాయని వారు చెప్పినట్లు ఆమె వెల్లడించింది.

ఈ సందర్భంగా భవానీ కన్న తల్లిదండ్రులు మాట్లాడుతూ.. 12 ఏళ్ల తర్వాత మా పాప భవానీ కనిపించడం సంతోషంగా ఉందన్నారు. మా పాపను తమకు అప్పగించాలని పోలీసులను కోరామని, తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని ఆమె స్పష్టం చేశారు. 

Also Read:చంద్రబాబుతో భేటీ: బుక్కైన ఆనం, జగన్ సీరియస్

శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లికి చెందిన భవానీ దాదాపు 14 ఏళ్ల కిందట సోదరుడి వెంట స్కూలుకు వెళ్లి తప్పిపోయింది. దీంతో ఆమె కోసం తల్లిదండ్రులు ఎన్నో ఏళ్లుగా వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో వారు కూతురిపై ఆశలు వదులుకున్నారు.

అయితే భవానీ గురించి తెలుసుకున్న విజయవాడ పటమటలంకకు చెందిన మోహన్ వంశీ అనే వ్యక్తి యువతిని ఆమె కుటుంబసభ్యులకు పరిచయం చేశాడు. తన ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన భవానీ గతం గురించి తెలుసుకున్న ఆయన.. ఆమె చెప్పిన ఆధారాలతో సంబంధిత వ్యక్తుల కోసం ఫేస్‌బుక్‌లో వెతికాడు.

Also Read:బెజవాడలో దారుణం: స్నానం చేస్తున్న కూతురి ఫోటోలు తీసిన తల్లి, చివరికిలా..

అలా భవానీ తల్లిదండ్రుల జాడ గుర్తించి అందరినీ కలిపాడు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే జరిగినా.. భవానిని 14 ఏళ్ల పాటు పెంచిన జయమ్మ ఈ విషయం జీర్ణించుకోలేకపోయింది.

ఆమెను కన్నవారికి అప్పగించేందుకు ససేమిరా అనడంతో పాటు వారు భవానీ కన్న తల్లిదండ్రులు నడానికి గ్యారంటీ ఏంటి అని ప్రశ్నించింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతానని.. దీనితో పాటు డీఎన్ఏ టెస్ట్ చేయించాకే, భవానీని అప్పగిస్తామని తేల్చి చెప్పడంతో హైడ్రామా నడిచింది. 

Follow Us:
Download App:
  • android
  • ios