గుంటూరు:  టిడిపి అధినేత  చంద్రబాబు నాయుడిపై వైసిపి నాయకులు ఎంత బురదజల్లాలని ప్రయత్రించినా ప్రజలు నమ్మబోరని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. అంత్యంత అవినీతిపరుడు నడిపిస్తున్న పార్టీ నాయకులుగా వున్నావారు చంద్రబాబుపై  అవినీతి ఆరోపణలు  చేయడం విడ్డూరంగా వుందన్నారు. ఐటీ దాడులు పేరుతో చంద్రబాబుపై చేస్తున్నదంతా దుష్ఫ్రచారమేననని అన్నారు. 

మరోసారి సోషల్ మీడియా వేదికన వైసిపి నాయకులు, ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయి రెడ్డిలపై వెంకన్న ఫైర్ అయ్యారు. ''అవినీతిపరుల్లో వైఎస్ జగన్ దేశంలోనే నెంబర్ 1, ప్రజాధనం కొట్టేసిన వాడు దొంగ డబ్బుతో ముఖ్యమంత్రి అయినంత మాత్రాన చట్టానికి అతీతం కాదు అని స్వయంగా సీబీఐ కోర్టులో వాదనలు వినిపిస్తుంది''  అంటూ వెంకన్న ట్వీట్ చేశారు. 

read more  రావాలి జగన్, కావాలి జగన్ అని జైలు పిలుస్తోంది: నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు
 
''జగన్ అవినీతి సామ్రాజ్యం, సూట్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్, క్విడ్ ప్రో కో లాంటి అంశాల గురించి తెలుసుకొని ప్రపంచ కార్పొరేట్ సంస్థలే ఆశ్చర్యపోయాయి. ప్రపంచంలోని పెద్ద యూనివర్సిటీల్లో జగన్ గారి అవినీతి చరిత్రని కేస్ స్టడీలుగా చెబుతున్నారు'' విమర్శించారు.

''ప్రాథమిక విచారణలోనే 43 వేల కోట్లు జగన్ గారు కొట్టేసినట్టు తేలింది. విచారణ పూర్తయితే ముఖ్యమంత్రి గా చేస్తున్న అవినీతితో కలిపి 20 లక్షల కోట్లు దొరుకుతాయి. విజయసాయి రెడ్డి గారి శేష జీవితం జగన్ గారితో కలిసి జైలు ఊచలు లెక్కపెట్టడమే'' అంటూ ఎద్దేవా చేశారు.

''దో నెంబర్ దందా తో నడిపే బ్లాక్ పేపర్, ఛానల్ లో ఐటీ రైడ్స్ కి సంబంధించిన వార్తలు చూస్తుంటే నవ్వొస్తుంది. రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు అంతా చంద్రబాబు గారి హయాంలోనే ఇంగ్లీష్ నేర్చుకోవడం మొదలుపెట్టారు'' అని అన్నారు.

read more   ఆ రూ.2వేల కోట్ల అవినీతిపై పవన్ మాట్లాడడే..? మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

''మూడు ఇన్ఫ్రా కంపెనీలపై కూడా రైడ్స్ చేసాం అని ఐటీ వాళ్లు పత్రికా ప్రకటన ఇస్తే బోడి గుండుకి, మోకాలికి ముడి పెట్టినట్టు ఇన్ఫ్రా కంపెనీల్లో అవకతవకలు జరిగినట్టు గుర్తించాం అని ఐటీ శాఖ అంటే చంద్రబాబుగారి మాజీ పీఎస్ దగ్గర 2 వేల కోట్లు దొరికేసాయి అని తెగ సంబరపడుతున్నారు వైకాపా నేతలు.''
 
''ముందు ఐటీ శాఖ ఇచ్చిన ప్రెస్ నోట్ చదవడం వచ్చిన వాళ్లతో చదివించుకొవాలని వైకాపా నేతల్ని కోరుతున్నాను'' అంటూ బుద్దా వెంకన్న వరుస ట్వీట్లతో వైసిపి నాయకులపై విరుచుకుపడ్డారు.