Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీ కార్యదర్శిపై కఠిన చర్యలు... ఏం చేయనున్నామంటే...: రాజేంద్రప్రసాద్

శాసన మండలి ఛైర్మన్ ఆదేశాలనేే  కాదు మండలిలోని మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అసెంబ్లీ సెక్రటరీపై కఠిన చర్యలు తీసుకుంటామని టిడిపి ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. 

TDP MLC Babu Rajendra Prasad Warning to  Assembly Secretary
Author
Vijayawada, First Published Feb 19, 2020, 10:05 PM IST

విజయవాడ: రానున్నబడ్జెట్ సమావేశాలలో శాసనమండలి కార్యదర్శి పైన సభాహక్కుల ఉల్లంఘన కింద తీర్మానంపెట్టి కఠినచర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ తెలిపారు. విజయవాడలో శాసనమండలి  చైర్మన్ షరీఫ్ ను ఆయన స్వగృహంలో కలిసిన రాజేంద్రప్రసాద్ పూలగుచ్చం, శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలను తెలియజేశారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకోసం, రాజధాని అమరావతి కోసం, తమ భూములు ఇచ్చిన రైతుల కోసం, నీతి నిజాయితీలతో అధికారపక్షం వత్తుడులకు తలవగ్గకుండా,నిబంధనలు అనుగుణంగా రాజ్యాంగ ప్రకారమే షరీఫ్ మూడు రాజదానుల బిల్లులను సెలెక్ట్ కమిటీ కి పంపించారని అన్నారు.

read more  గుంటనక్కలా కాదు సింహంలా ఒక్కరోజైనా బ్రతుకు..: చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫైర్

మండలి చైర్మన్ ఆదేశాలను తూచా తప్ప కుండా మండలి కార్యదర్శి అమలు చెయ్యాలన్నారు. మండలి కార్యదర్శి ఆ రెండు బిల్లులపైసెలెక్ట్ కమిటీలు వేసి పంపకుంటే రాబోయే బడ్జెట్ సమావేశాలలో కార్యదర్శిపై  సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని కౌన్సిలో ప్రవేశపెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

శాసన మండలి ఛైర్మన్ ను ఎమ్మెల్సీతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లూరి కిరణ్ తదితరులు కలుసుకున్నారు. వారందరూ వికేంద్రీకరణ బిల్లుపై సందర్భంగా ఛైర్మన్ వ్యవహరించిన తీరును ప్రశంసించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios