అమరావతి: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పై టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు. ఆయనో బ్రోకర్ అని... ప్రస్తుతం పదవి కోసం ప్రాకులాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. రూ.43వేల కోట్ల దోపిడీదారు దగ్గర  చేరి తానూ ఎంతోకొంత దోచుకోవాలన్న ప్రయత్నంలో వున్నాడంటూ అనురాధ మండిపడ్డారు. 

''బ్రోకరిజం కి పేటెంట్ హక్కు ఉంది మీ ఒక్కరికే ఆమంచి గారు. బ్రోకర్లు,బ్రోకరిజం గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. మీలో మంచి తక్కువ బ్రోకరిజం ఎక్కువ అని ప్రజలు ఛీ కొట్టారు.జగన్ గారిని మెప్పించి ఎదో ఒక పదవి తెచ్చులోవాలని చంద్రబాబు గారి పై ఆరోపణలు చేస్తున్నారు.''

''మీ నీతులు బ్లాక్ మీడియా నడుపుతున్న జగన్ గారికి చెప్పండి. జర్నలిస్టులపై దాడి చేసే మీరు జర్నలిజం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. 43 వేల కోట్లు కొట్టేసిన వాడి దగ్గర ఎంతో కొంత కొట్టేయాలి అని ఆమంచి పడుతున్న పాట్లు అన్ని, ఇన్ని కావు'' అంటూ అనురాధ ట్వీట్ చేశారు. 

read more  బిజెపి నేతల కాళ్లు పట్టుకుని ఎన్డీఏలో చేరిక... అందుకోసమేనా జగన్ గారు..?: నిలదీసిన బుద్దా

ఇక దిశ చట్టం గురించి ఆమె మరికొన్ని ట్వీట్స్ చేశారు. ''దిశ చట్టం ద్వారా న్యాయం ఎక్కడ? నెల్లూరు లో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మహిళా ఎంపిడిఓ సరళ గారి పై దారుణంగా దాడి చేసారు. మహిళ అని చూడకుండా ఇంటికి వెళ్లి మరీ దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన జరిగి నేటికీ 4 నెలలు అవుతుంది''
 
''దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో విచారణ పూర్తి అయ్యి నిందితుడికి శిక్ష కూడా ఖరారు కావాలి. ఒక మహిళా అధికారికి అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని దీక్ష చేసే పరిస్థితి తీసుకొచ్చిన వైసిపి పార్టీ ప్రభుత్వం ఆవిడకి దిశ చట్టం ద్వారా ఎప్పుడు న్యాయం చేస్తుంది'' అంటూ దిశ చట్టం అమలుపై  అనురాధ ప్రభుత్వానికి  ప్రశ్నలు సంధించారు.