Asianet News TeluguAsianet News Telugu

వరుసగా రెండు ఫోన్లు: కంగారు పెట్టి, సిమ్ మార్పించి రూ.7 లక్షలు కొట్టేశారు

ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులమని చెప్పి ఓ వ్యక్తికి టోకరా వేసి అక్షరాల రూ. 7,71,388 దోచేశారు సైబర్ కేటుగాళ్లు.

cyber fraud held in vijayawada
Author
Vijayawada, First Published Jan 19, 2020, 3:26 PM IST

ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులమని చెప్పి ఓ వ్యక్తికి టోకరా వేసి అక్షరాల రూ. 7,71,388 దోచేశారు సైబర్ కేటుగాళ్లు. వివరాల్లోకి వెళితే.. బెజవాడ ఎల్‌ఐసీ కాలనీకి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి గతేడాది నవంబర్ 8న ఒక ఫోన్ కాల్ వచ్చింది. తాము ఢిల్లీ క్రైం పోలీసులమని, మహిళలను ఫోన్‌లో వేధిస్తున్నారంటూ మీపై ఫిర్యాదులు అందాయని ఢిల్లీ రావాల్సిందిగా గట్టిగా గర్జించారు.

దీనిపై కంగారుపడిన వెంకటేశ్వరరావు అంతదూరం రాలేనని చెప్పడంతో అటువైపు వ్యక్తి ఫోన్ కట్ చేశారు. ఇది జరిగిన కాసేపటికే వోడావోన్ లీగల్ సెల్ నుంచి మాట్లాడుతున్నానని సంజయ్ శర్మ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. మీరు వాడుడుతున్న యాపిల్ ఫోన్ సిమ్‌కార్డ్ క్లౌన్ అయ్యుండొచ్చని మాయ మాటలు చెప్పి వెంకటేశ్వరరావుని నమ్మించారు.

Also Read:మ్యాట్రీ మోనీ మోసం... పోలీసులకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఫిర్యాదు

క్లోన్ అయింది లేనిది తెలుసుకోవాలంటే యాపిల్ ఫోన్‌లో ఉన్న సిమ్ తీసివేసి ఏదైనా అండ్రాయిడ్ ఫోన్‌లో వేయాలని, అలాగే ప్లేస్టోర్‌లోకి వెళ్లి డీఓటీ సెక్యూర్. ఏపీకే అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పారు. నిజమేనని నమ్మిన వెంకటేశ్వరరావు ఫోన్‌లో వాళ్లు చెప్పినట్లే చేశాడు.

రెండు రోజుల తర్వాత వెంకటేశ్వరరావు తన క్రెడిట్ కార్డ్ లావాదేవీలను పరిశీలిస్తే అతని కార్డును వినియోగించి రూ.7,71,388ల విలువైన విమానం టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు గుర్తించాడు. ఫోన్‌కు ఓటీపీ మేసేజ్ రాకుండానే ఇంత నగదు కేటుగాళ్ల చేతిలోకి వెళ్లడంతో వెంకటేశ్వరరావు ఖంగుతిన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన బెజవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వెంకటేశ్వరరావుకు వచ్చిన ఫోన్ నెంబర్లపై నిఘా వుంచడంతో పాటు యాప్ ద్వారా ఫోన్‌లోని బ్యాంకు ఖాతా, క్రెడిట్ కార్డు వివరాలను తస్కరించినట్లు గుర్తించారు.

Also Read:బిటెక్ స్టూడెంట్ కీ రోల్... గుంటూరులో హైటెక్ వ్యభిచారం

ఫోన్ భద్రతకు ముప్పు కలిగించే డీఓటీ సెక్యూర్ ఏపీకే యాప్‌ను యాపిల్ నిరాకరిస్తుండటంతో వెంకటేశ్వరరావు చేత సిమ్‌ను ఆండ్రాయిడ్ ఫోన్‌లో వేయించారు. క్రెడిట్ కార్డును వినియోగించినా ఓటీపీ మొబైల్‌కు వెళ్లకుండా సరికొత్త టెక్నాలజీని వినియోగించినట్లుగా పోలీసులు గుర్తించారు.

మేక్ మై ట్రిప్, ఈజీ మై ట్రిప్‌ల ద్వారా విమానం టిక్కెట్లను బుక్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ఆయా సంస్థలతో మాట్లాడి తిరిగి నగదును జమ చేయించారు. తన డబ్బు తనకు తిరిగి రావడంతో వెంకటేశ్వరరావు విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావును కలిసి కృతజ్ఙతలు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios