Asianet News TeluguAsianet News Telugu

ఫిబ్రవరి 14న డిజిపి గౌతమ్ సవాంగ్ రావాల్పిందే..: ఏపి హైకోర్టు

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు డిజిపి గౌతమ్ సవాంగ్ ఫిబ్రవరి 14న కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. 

Andhra pradesh High Court orders to DGP sawang
Author
Amaravathi, First Published Feb 12, 2020, 2:59 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఓ మిస్సింగ్ కు సంబంధించిన కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ను తమ ముందు హాజరుకావాల్సిందిగా అత్యున్నత న్యాయస్థాయం ఆదేశించారు. ఈ కేసు విషయమై ఫిబ్రవరి 14న హైకోర్టు ముందు స్వయంగా హాజరు కావాల్సిందిగా పోలీస్ బాస్ కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 

గతంలో ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసులో హైకోర్టు ఈ మేరకు బుధవారం స్పందించింది. రెండ్రోజుల గడువుతో అంటే ఫిబ్రవరి 14న హైకోర్టుకు హాజరు కావాలని నిర్దేశించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి లోచిని అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ గతంలో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలైంది. విచారించిన హైకోర్టు ధర్మాసనం జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలిచ్చింది.

read more  లైంగిక వేధింపులు.. హెడ్ మాష్టర్ ని చితకబాదిన గ్రామస్థులు

 జ్యూడిషియల్ విచారణ జరపాల్సిందిగా విశాఖపట్నం సీనియర్ సివిల్ జడ్జిని నియమించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విశాఖ సీనియర్ సివిల్ జడ్జి న్యాయ విచారణ పూర్తి చేశారు. అనంతరం ఆయన నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేశారు.

విశాఖ సీనియర్ సివిల్ జడ్జి నివేదికను పరిశీలించిన అమరావతి హైకోర్టు ధర్మాసనం నివేదికాంశాల ఆధారంగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఫిబ్రవరి 14వ తేదీన ధర్మాసనం ఎదుట హాజరు కావాలని... ఈ కేసుకు సంబంధించిన వివరాలతో వివరణ ఇచ్చేందుకు సిద్ధం కావాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios