Asianet News TeluguAsianet News Telugu

ఏం కాలమిదీ: చిటారు కొమ్మన మిఠాయి పొట్లం (వీడియో)

మధురమైన పండు సీతాఫలం. చలికాలంలో దొరికే ఈ పండు అనేక ఔషధగుణాలతో కూడి అతి మధురంగా ఉండే ఫలం. చిన్నలూ, పెద్దలూ తేడా లేకుండా ఇష్టపడే పండు ఇది. ఎన్నో పోషకవిలువలు కలిగిన ఈ ఫలం గుండెసంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుంది. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది.

మధురమైన పండు సీతాఫలం. చలికాలంలో దొరికే ఈ పండు అనేక ఔషధగుణాలతో కూడి అతి మధురంగా ఉండే ఫలం. చిన్నలూ, పెద్దలూ తేడా లేకుండా ఇష్టపడే పండు ఇది. ఎన్నో పోషకవిలువలు కలిగిన ఈ ఫలం గుండెసంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుంది. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది.
పోషకవిలువలు అధికంగా ఉండే ఈ పండులో కొవ్వు ఉండదు. ఒక సీతాఫలంలో 200 క్యాలరీల శక్తి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ తగు మోతాదుల్లో ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే పండు ఇది. 

సీతాఫలం చర్మవ్యాధులకు మంచి మందుగా పనిచేస్తుంది. పేగుల్లో ఉండే నులిపురుగుల నివారణలో తోడ్పడుతుంది. మామూలుగా వచ్చే అలసట దూరమవుతుంది. వాంతులు తలనొప్పిలాంటి వాటికి విరుగుడుగా కూడా పనిచేస్తుంది.

ఆపరేషన్స్ అయిన తరువాత, గాయాలు మానుతున్న సమయంలో తింటే త్వరగా మానతాయి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తి తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది. 
సీజన్ లో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఈ పండు ప్రస్తుతం సామాన్యుడికి అందుబాటులో లేదనే చెప్పాలి. కిలో 300, 400లుగా అమ్ముతున్నారు. దీనికీ కారణాలున్నాయి..

నిజానికి సీతాఫలం మనది కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల మొక్క. పదహారో శతాబ్దంలో పోర్చుగీసువాళ్లు భారతదేశానికి తీసుకువచ్చారట. ఎక్కడపుట్టినా, ఎప్పుడొచ్చినా మనదగ్గరికి వచ్చింది మనదే...సో సీతాఫలం మనపండే.

పండే కాదు ఆకులు, బెరడు, వేరు ఇలా సీతాఫలం చెట్టులోని అన్ని భాగాలూ ఔషధ తయారీలో ఉపయోగిస్తారు. ఇక్కడో విచిత్రం ఉంది సీతాఫలం మధుమేహం అంటే షుగర్ ఉన్నవాళ్లకు పనికిరాదు. కానీ వీటి ఆకులు మధుమేహాన్ని తగ్గించే గుణం ఉందట. బెరడుని మరిగించి తీసిన డికాక్షన్ డయేరియాని తగ్గిస్తుందట. ఆకుల కషాయం జలుబుని తగ్గిస్తుందట.

మరి ఇన్ని పోషకవిలువలు, ఔషధవిలువలు ఉన్నప్పుడు రేట్లు అందుబాటులో లేకుంటే సామాన్యులు వాపోవడంలో తప్పేం లేదు కదా...

అయితే తినాలనుకున్నవారికి రేట్లతోనూ, దొరకడంతోనూ సంబంధం లేదు. కాస్త రేటు ఎక్కువైనా కొనేస్తారు, తినేస్తారు. సో మీరు కూడా సీజన్ అయిపోయేలోపే ఓ పది పండ్లు లాగించేయండి.