Asianet News TeluguAsianet News Telugu

video news : సీసీ కెమెరా కనెక్షన్లు తొలగించి..కట్టర్ తో తాళాలను తొలగించి..

విజయవాడ రామవరప్పాడు వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని రెండు హుండీలను పగలకొట్టి ఆగంతకులు నగదు ఎత్తి కెళ్లారు. హుండీలో చోరీకి గురైన సొమ్ము రూ.50వేలకు పైగా ఉండవచ్చని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఆలయంలోని తాళాలని కట్టర్ సాయంతో తొలగించి దొంగతనం చేశారు. సంఘటన స్ధలంలో సీసీ కెమెరా కనెక్షన్లు తొలగించి వేలిముద్రలు పడకుండా దొంగలు‌‌ జాగ్రత్త పాటించారు. అంతర్రాష్ట్ర ఆలయాల చోరి ముఠా పని అని పోలీసులు భావిస్తున్నారు. ‌‌

First Published Nov 5, 2019, 4:06 PM IST | Last Updated Nov 5, 2019, 4:45 PM IST