పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నారు (వీడియో)

కృష్ణ జిల్లా మచిలీపట్నం మండలం బుద్దలపాలెం గ్రామంలో వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు.  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రైతులను పంట సహాయం కింద రైతు భరోసా ఇస్తున్నారని చెప్పారు.  వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ప్రతి ఒక్క రైతుకు 13500రూ.ల మొత్తం నేరుగా రైతు ఖాతాలో జమ అవుతుందని ఈ మొత్తాన్ని రైతులు పంటకు ఉపయోగించుకోవాలని మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని తెలిపారు. ఈరోజు రైతుల బ్యాంకు ఖాతాల్లో 7500 రూపాయలు జమ అవుతుందని జనవరి మాసంలో మిగిలిన  మొత్తం సొమ్ము రైతు ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని చెప్పారు.

First Published Oct 15, 2019, 2:51 PM IST | Last Updated Oct 15, 2019, 2:51 PM IST