సంపన్నులు, కాలేజీ విద్యార్థులే టార్గెట్ (వీడియో)

విజయవాడలో డ్రగ్స్ ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి విజయవాడ, గుంటూరు ప్రాంతాల సంపన్న కుటుంబాలకు చెందిన యువతీ యువకులకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు.

First Published Oct 12, 2019, 6:12 PM IST | Last Updated Oct 12, 2019, 6:12 PM IST

విజయవాడలో డ్రగ్స్ ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి విజయవాడ, గుంటూరు ప్రాంతాల సంపన్న కుటుంబాలకు చెందిన యువతీ యువకులకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. 

డ్రగ్స్ విక్రయిస్తున్న ఈ ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారినుండి 14 గ్రాముల డ్రగ్స్, రెండున్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో సూడాన్ దేశానికి చెందిన మహమ్మద్ గహేల్ రసూల్, టాంజానీయ దేశానికి చెందిన లీశ్వ షాబాని ఉన్నారు.

అనంత్ కుమార్,శ్రీకాంత్ ఈ ముఠాలో కీలక వ్యక్తులు. బెంగళూరులో 2000 -2500 రూపాయలకు ఈ డ్రగ్స్ కొనుగోలు చేసి 4000 వేల రూపాయలకు విద్యార్థులకు విక్రయిస్తున్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల కదలికలపై దృష్టి సారించాలి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలి. డ్రగ్స్ కల్చర్ ని విజయవాడలో అనుమతించం అని విజయవాడ డీసీపీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.