విజయవాడలో లాక్‌డౌన్.. కన్ఫ్యూజ్ చేసి.. అంతలోనే క్లారిటీ ఇచ్చి..
విజయవాడ లాక్‌డౌన్ సస్పెన్స్‌కు తెరపడింది.
విజయవాడ లాక్‌డౌన్ సస్పెన్స్‌కు తెరపడింది. ఈ నెల 26 నుంచి విజయవాడలో లాక్‌డౌన్ విధించనున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఉపసంహరించుకున్నారు. ఈమేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులను జారీ చేసే వరకు లాక్ డౌన్ ఉండదు. అయితే ఈ నెల 26 నుంచి వారంపాటు లాక్‌డౌన్ విధిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఇంతియాజ్ మీడియాకు వీడియో కూడా రిలీజ్ చేశారు కానీ గంటలోపే ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మరో ప్రకటన విడుదల చేశారు. దీంతో ప్రజల్లో లాక్ డౌన్ ఉంటుందా? లేదా? అనే విషయంలో కాస్త కన్ ఫ్యూజన్ నెలకొంది. అయితే లాక్ డౌన్ లేదనే క్లారిటీ వచ్చింది.