Asianet News TeluguAsianet News Telugu

నవరత్నాల అమలుపై సీఎస్ నీలం సహానీ ఆరా (వీడియో)

విజయవాడ రూరల్ గూడవల్లి గ్రామ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నవరత్న సంక్షేమ పథకాల కార్యాశాలను చీఫ్ సెక్రటరీ నీలం సహానీ సందర్శించారు. 

విజయవాడ రూరల్ గూడవల్లి గ్రామ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నవరత్న సంక్షేమ పథకాల కార్యాశాలను చీఫ్ సెక్రటరీ నీలం సహానీ సందర్శించారు. ఈ సందర్భంగా నవరత్న పథకాలు ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించిన అనంతరం పధకాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తో కలిసి ఆమె చర్చించారు..

ఈ సందర్భంగా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల తో సిఎస్ నీలం సహాని నేరుగా మాట్లాడి అమలు తీరు వాటిలోని లోటుపాట్లు పై నిశితంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించగా సిఎస్ నీలం సహాని గర్భిణీలకు వివిధ రకాల అనంతరం అక్కడే ఉన్న చిన్న పిల్లలకు బాలామృతం ప్యాకెట్లు పంపిణీ చేశారు.