
ఆపరేషన్ సింధూర్‌లో రాఫెల్‌ను ఎందుకు వాడారో తెలుసా.?
Operation Sindoor: రెండు వారాల క్రితం జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ మెరుపు దాడి చేసింది. దీనికి "ఆపరేషన్ సింధూర్" అని పేరు పెట్టారు. మే 7వ తేదీ అర్ధరాత్రి 1:44 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులను "లక్ష్యపూర్వకమైనవి, ఉద్రిక్తతను పెంచనివి" అని అభివర్ణించింది. కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేసుకొని ఈ దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో ఫ్రెంచ్ కి చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగించారు.