ఉగ్రవాదాన్ని ఓడించేందుకు ఏకమవుదాం: రాహుల్ గాంధీ

Share this Video

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. శ్రీనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు చేసే దాడులను ఓడించాలంటే ప్రతి భారతీయుడు ఐక్యంగా నిలవడం చాలా ముఖ్యమన్నారు. "కాశ్మీర్ వచ్చిన నా అన్నదమ్ములపై, అక్కచెల్లెళ్లపై కొంతమంది దాడులు చేయడం బాధాకరం. మనం అందరం కలిసినప్పుడే ఉగ్రవాదాన్ని నిర్మూలించగలం" అని రాహుల్ గాంధీ. జమ్మూ కాశ్మీర్ సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్‌తో భేటీ అయిన రాహుల్... వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.

Related Video