
Delta Plane Crash: టొరంటోలో ఘోర విమాన ప్రమాదం.. ఎలా జరిగిందంటే?
కెనడా రాజధాని టొరంటోలో ఘోర ప్రమాదం జరిగింది. టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం మంచుతో కూడిన నేలపై బోల్తా పడింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 19 మంది గాయపడగా... వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే...డెల్టా ఎయిర్ లైన్స్ కి చెందిన CRJ900 విమానం ల్యాండింగ్ అవుతుండగా.. ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విమానంలో 80 ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రతకు 18 మంది గాయపడ్డారు. బలమైన హిమపాతం, గాలుల కారణంగా విమానం కుప్పకూలినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. 18 మంది క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఆ ముగ్గురిలో ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది.