
Tirumala Temple: పహల్గాం దాడి నేపథ్యంలో తిరుమలలో విస్తృత తనిఖీలు
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్జేఎస్ కాంప్లెక్స్ సమీపంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కాగా, భద్రతాపరంగా ఎటువంటి లోపాలు లేకుండా చూసేందుకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో పోలీసులు, ప్రత్యేక బలగాలు కలిసి ఈ మాక్ డ్రిల్‌ను విజయవంతంగా పూర్తి చేశాయి.