
సునీత విలియమ్స్ రాకతో భారత్ లో సంబరాలు
అంతరిక్ష కేంద్రంలో దాదాపు 9 నెలలపాటు ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు తిరిగి వచ్చారు. కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన ఆమె ఇన్ని రోజులు అక్కడ సుదీర్ఘ కాలం ఉండాల్సి వచ్చింది. సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావడంతో భారత్ లో సంబరాలు చేసుకున్నారు