మస్కట్‌లో చిక్కుకున్న శ్రీకాకుళం కార్మికులు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ సాయంతో రాక | Asianet Telugu
శ్రీకాకుళం జిల్లాకు చెందిన 9 మంది కార్మికులు మస్కట్‌లో నకిలీ కంపెనీ వల్ల ఇరుక్కుపోయారు. భారత విదేశాంగ శాఖ, మస్కట్‌లో భారత రాయబార కార్యాలయం, NRI టీడీపీ చొరవతో వారు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పందించారు. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.