
త్వరలోనే భారీ తిమింగలాలు బయటపడతాయి: లిక్కర్ స్కాంపై సోమిరెడ్డి సంచలన కామెంట్స్
2019-24 మధ్య జరిగిన మద్యం అమ్మకాల్లో అంతర్జాతీయ స్కామ్ జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లు రూ.1.30లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ జరిగాయని.. రాష్ట్రాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ గా మార్చారన్నారు. రూ.3,200కోట్లు మేర మద్యం కుంభకోణం జరిగితే ఎందుకు ఈడీ, సీబీఐ ఎంట్రీ అవ్వడం లేదని ప్రశ్నించారు. "1980 బోఫోర్స్ కుంభకోణంలో కేవలం రూ. 60 కోట్లు మాత్రమే అవినీతి జరిగింది కానీ రాజీవ్ గాంధీ ప్రధాని పదవి పోయింది.. 2017లో 2G స్పెక్ట్రమ్ స్కామ్ లో మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ జాతీయ హోదా కొల్పోయే పరిస్ధితి వచ్చింది. రూ. 60కోట్లకే దేశ ప్రధానులను ప్రజలు మట్టుపెడితే.. మరి ఏపీలో జరిగిన రూ.10వేల కోట్ల మద్యం కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి ఏమి చేయాలి?" అని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు.