SLBC Tunnel collapse: సొరంగంలో 8మంది పరిస్థితి ఇదే: CM Revanth Reddy

Share this Video

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగం కూలిన ఘటనలో 8 మంది కార్మికులు లోపల చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకు వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర బలగాలు 10 రోజులుగా నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగం లోపల భారీగా మట్టి, బురద పేరుకుపోవడంతో రెస్క్యూ ఆపరేషన్స్ కి ఆటంకం కలుగుతోంది. అయినప్పటికీ బలగాలు సహాయక చర్యల్లో వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతున్నాయి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి SLBC టన్నెల్ ని సందర్శించారు. అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితి తెలుసుకున్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని బయటకు తీసుకు వచ్చేందుకు అన్ని విధాలా ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేత హరీష్ రావు చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు.

Related Video