
రామేశ్వరం పంబన్ బ్రిడ్జి ట్రయల్ రన్ సక్సెస్
తమిళనాడులోని రామేశ్వరంలో సముద్రంపై నిర్మించిన పంబన్ వర్టికల్ సీ బ్రిడ్జ్ సిద్ధమైంది. మోదీ చేతుల మీదుగా ఈ వంతెన ప్రారంభోత్సవం జరుగుతుంది. కాగా, అంతకుముందు నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ వంతెన పైనుంచి రైలు రాకపోకలు సాగిస్తుంది. అలాగే, కింద నుంచి ఓడలు ప్రయాణిస్తాయి. ఇది దేశంలోనే మొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జి కావడం విశేషం.