పవన్ కళ్యాణ్ రికార్డు: ఒకరోజు 1.55 లక్షల సేద్యపు కుంటల నిర్మాణం ప్రారంభం | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Mar 22, 2025, 6:00 PM IST

అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వ పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలం, పూడిచర్లలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల(ఫామ్ పాండ్స్) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.930 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1.55 లక్షల ఫామ్ పాండ్స్ కు శంకుస్థాపన చేశారు. పూడిచర్లలో రైతు సూర రాజన్నకు చెందిన 1.30 ఎకరాల వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేయనున్న సేద్యపు కుంటకు స్వయంగా భూమిపూజ చేశారు. ఉపాధి కూలీలతో కలసి గడ్డపార పట్టి గుంత తవ్వి సేద్యపు గుంత పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు భైరెడ్డి శబరి, పాణ్యం శాసనసభ్యురాలు చరితారెడ్డి, నందికొట్కూరు శాసన సభ్యులు గిత్తా జయసూర్య, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.