
పాక్ శాంతి ఒప్పందాన్ని నమ్మొద్దు: పవన్ కళ్యాణ్
ఆపరేషన్ సిందూర్ లో అమరుడైన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ కు కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళి తండాకు చేరుకొని మురళీ నాయక్ ను కడసారి చూసి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు అనంతరం మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్ శాంతి ఒప్పందాన్ని 3 గంటల్లోనే ఉల్లంఘించిందన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.