
పాక్ ఉగ్రవాదులకు వంత పాడటం సిగ్గుచేటు: ఎయిర్ మార్షల్ AK భారతి
పాక్ ఉగ్రవాదులకు వంతపాడడం సిగ్గుచేటని ఎయిర్ మార్షల్ ఏకే భారతి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎయిర్ మార్షల్ అవధేశ్ కుమార్ భారతి, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ సందీప్ ఎస్ శార్దా పాల్గొని పాక్ దురాక్రమణలపై తీవ్రంగా స్పందించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత త్రివిధ దళాలు ఎలా సమన్వయంగా స్పందిస్తున్నాయో వివరించారు.