Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు PMమోదీ స్ట్రాంగ్ వార్నింగ్

Share this Video

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడిలో అమాయక టూరిస్ట్ లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో దేశమంతా శోకసముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారి బహిరంగంగా స్పందించారు. బీహార్ లోని మధుబనిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించి.. నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెర్రరిస్టులను, టెర్రరిస్టులకు సహాయం చేస్తున్న వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడిపై మాకు మద్దతుగా నిలిచిన ప్రపంచ దేశాల నాయకులకు, ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు.

Related Video