నేను సగం పాకిస్తానీని.. 48గంటల్లో వెళ్లిపోమంటే ఎలా?

Share this Video

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర దాడి భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల్లో పాక్ పౌరులు తమ దేశానికి తిరిగి వెళ్లాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో కుటుంబాలు ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్‌కు తిరిగి వెళ్తున్న ఓ మహిళ తన ఆవేదనను వెల్లగక్కింది. "48 గంటల్లోపు బయలుదేరమని మాకు చెప్పారు. అది ఎలా సాధ్యం? జోధ్‌పూర్ నుండి అట్టారి 900 కి.మీ. దూరంలో ఉంది. మాకు బస్సులు దొరకడం లేదు. టిక్కెట్ల కోసం నా భర్త లక్ష రూపాయల నష్టాన్ని భరించాల్సి వచ్చింది. ఎలాగైనా నా భర్త పిల్లలను చేరుకోవాలి. నాకు ఇండియా పాస్‌పోర్ట్ ఉంది కానీ, నేను సగం పాకిస్తానీని. ఉగ్రవాద దాడికి నేను అపరాధ భావనతో ఉన్నాను, కానీ అందులో సామాన్యుల తప్పు ఏమిటి? వారు ఇస్లాం కోసం అలా చేశారో లేదో నాకు తెలియదు, వారు నా బంధువులు కాదు. నాకు భారతదేశం, పాకిస్తాన్ రెండూ ముఖ్యమే. సరిహద్దులు దాటి వివాహం చేసుకున్న మహిళలకు ఏదో ఒక ఎంపిక ఉండాలి. రెండు ప్రభుత్వాలు సామాన్య ప్రజలను వేధించవద్దని అభ్యర్థిస్తున్నా..." అని పాకిస్తాన్‌కు తిరిగి వెళ్తున్న మహిళ వాపోయింది.

Related Video