
Pahalgam Attack: బైసరన్ లో ఉగ్రదాడిపై స్థానికులు ఏమంటున్నారంటే.. Asianet Exclusive Report
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్ర దాడి ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో పర్యాటకులు, స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అత్యవసర భేటీ నిర్వహించారు. బైసరన్ లోయను ఇండియన్ ఆర్మీ, భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో Asianet News బృందం పహల్గాంలో పర్యటించింది. ఉగ్ర దాడి ఘటనపై స్థానికులతో మాట్లాడి.. అక్కడి పరిస్థితి తెలుసుకొంది.